(MS8NEWS సుల్తానాబాద్ (గర్రెపల్లి), జనవరి 14):బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కన్న రమేష్ మాతృమూర్తి, గర్రెపల్లి మాజీ సర్పంచ్ కన్న ఈశ్వరమ్మ మృతి పట్ల పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉష తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న దాసరి ఉష గర్రెపల్లిలోని వారి నివాసానికి చేరుకుని, ఈశ్వరమ్మ పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కన్న రమేష్ ని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో దాసరి ఉష తో పాటు బీసీ జేఏసీ పెద్దపల్లి జిల్లా నాయకులు పాల్గొన్నారు:కొండి సతీష్ (జిల్లా వైస్ చైర్మన్),నల్లవెల్లి శంకర్ (వర్కింగ్ చైర్మన్),మరియు నాయకులు రాహుల్, మణికంఠ, నాగరాజు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

