Monday, April 13, 2026

​తబితా ఆశ్రమ పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలి: మద్దెల దినేష్ ​ఆశ్రమ పిల్లలకు పతంగులు, పండుగ ఫలహారాల పంపిణీ

​MS8NEWS రామగుండం | బుధవారం | 14-01-2026

​తబితా ఆశ్రమ పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలి: మద్దెల దినేష్,ఆశ్రమ పిల్లలకు పతంగులు, పండుగ ఫలహారాల పంపిణీ,నిర్వాహకులు వీరేంద్ర నాయక్ కు ఘన సన్మానం.పాల్గొన్న సిపిఐ ప్రజాసంఘాల నాయకులు

రామగుండంలోని తబితా ఆశ్రమంలో ఉన్న పిల్లలందరూ క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగి, దేశానికి సేవలు అందించాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ ఆకాంక్షించారు.బుధవారం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆయన ఆశ్రమ పిల్లలతో కలిసి పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలకు పతంగులతో పాటు, సంక్రాంతి ప్రత్యేక ఫలహారాలైన సకినాలు, అరిసెలు, కారంపూసలను అందజేశారు. పిల్లలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారితో కాసేపు ముచ్చటించారు.

​నిర్వాహకుడికి సత్కారం:గత రెండు దశాబ్దాలుగా నిరాశ్రయులైన పిల్లలను చేరదీసి, వారికి తల్లిదండ్రుల లోటు తెలియకుండా అండగా నిలుస్తున్న ఆశ్రమ నిర్వాహకులు వీరేంద్ర నాయక్ సేవలను దినేష్ కొనియాడారు. ఈ సందర్భంగా నాయక్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు.

​పాల్గొన్న ముఖ్యులు:ఈ కార్యక్రమంలో సిపిఐ ప్రజా సంఘాల నాయకులు ఎం.ఎ.గౌస్, వై.లెనిన్, తొడుపునూరి రమేశ్ కుమార్ తదితరులు పాల్గొని పిల్లలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సేవా దృక్పథంతో ముందుకు వస్తున్న మద్దెల దినేష్ ను వారు అభినందించారు.

Related Articles

Most Popular