(MS8NEWS జనవరి 13):గోదావరిఖని: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ (NSUI) నాయకుడు దాసరి విజయ్ కుమార్‌ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొంతల రాజేష్ ప్రకటించారు.
సస్పెన్షన్‌కు గల కారణాలు:ఈ నెల 11వ తేదీన (11-01-2026) గోదావరిఖనిలో జరిగిన “ఇండ్ల పట్టాల పంపిణీ” కార్యక్రమం అనంతరం, సభా వేదికపై విజయ్ కుమార్ ఇతర నాయకులతో దురుసుగా ప్రవర్తించారని పార్టీ క్రమశిక్షణ కమిటీ పేర్కొంది. నాయకులను దూషించడమే కాకుండా, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు గాను ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో తెలిపారు.ఈ సస్పెన్షన్ నేటి నుండి (13-01-2026) అమల్లోకి వస్తుంది అనీ బొంతల రాజేష్ (అధ్యక్షులు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ) తెలిపారు.
పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని ఈ సందర్భంగా పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.

