(MS8NEWS జనవరి 11):గోదావరిఖని: పట్టణంలోని నివాస ప్రాంతాల్లోని ఇరుకైన గల్లీల్లో వాహనదారుల అతివేగం ప్రాణాల మీదకు తెస్తోంది. తాజాగా ఒక బైకర్ అతివేగంగా వెళ్తూ ఆడుకుంటున్న చిన్నారులను ఢీకొట్టినంత పనిచేశాడు. ఈ భయంకర దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.ఒక ఇరుకైన వీధిలో కొందరు చిన్నారులు ఆడుకుంటున్నారు. అదే సమయంలో ఒక వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై అత్యంత వేగంగా ఆ గల్లీ గుండా వెళ్లాడు. ఆ వేగంలో నియంత్రణ కోల్పోయి, అక్కడ నిలబడి ఉన్న ఒక బాలుడిని తృటిలో ఢీకొట్టబోయాడు.బైక్ వేగంగా వస్తుండటం గమనించిన బాలుడు వెంటనే పక్కకు జరగడంతో పెను ప్రమాదం తప్పింది.ఒక్క సెకను అటు ఇటు అయినా ఆ బాలుడు బైక్ కింద పడేవాడు. ఈ ఘటనతో అక్కడ ఆడుకుంటున్న మిగిలిన పిల్లలు, స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
స్థానికుల ఆగ్రహం:మెయిన్ రోడ్లలాగా గల్లీల్లో కూడా బైకర్లు ఇంత వేగంగా వెళ్లడంపై స్థానికులు మండిపడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు ఆడుకునే వీధుల్లో వాహనదారులు వేగం తగ్గించాలని, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపేవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

