Monday, April 13, 2026

​ప్రతి ఆడబిడ్డ కళ్ళలో సంతోషం చూడడమే నా లక్ష్యం: ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్

(MS8NEWS జనవరి 10):​​రామగుండం/అంతర్గాం :రామగుండం నియోజకవర్గ అభివృద్ధి మరియు నిరుపేద కుటుంబాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని స్థానిక శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అన్నారు. శనివారం అంతర్గాం మండలం గోలివాడ సమ్మక్క-సారక్క జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.అంతర్గాం మండలానికి చెందిన 31 మంది లబ్ధిదారులకు మొత్తం 31,03,596 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.మహిళల సౌకర్యార్థం అంతర్గాం మరియు పాలకుర్తి మండలాల్లో చెరో రెండు కోట్ల రూపాయలతో అత్యాధునిక మహిళా భవనం/ఫంక్షన్ హాళ్లను నిర్మిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ప్రతి గల్లీలో రోడ్లు, డ్రైనేజీలు మరియు లైటింగ్ వ్యవస్థను పూర్తిస్థాయిలో మెరుగుపరుస్తామని, అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు.

​”ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ప్రజా ప్రభుత్వ పథకాలు ప్రతి గడపకూ అందేలా చూస్తున్నాం. రామగుండం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపడమే నా సంకల్పం.” – ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు వివిధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు.

Related Articles

Most Popular