(MS8NEWS జనవరి 10):గోదావరిఖని: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ (ఎగ్జిబిషన్ గ్రౌండ్) లో రేపు (జనవరి 11, 2026) ప్రభుత్వ అధికారిక కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో భారీ జనసమీకరణ, భద్రతా కారణాల దృష్ట్యా పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు రామగుండం ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.వాహనదారులు ఇబ్బంది పడకుండా కింది విధంగా ట్రాఫిక్ దారి మళ్లింపు (Traffic Diversion) చేపట్టారు:
ప్రధాన మళ్లింపు మార్గాలు:
బస్టాండ్ వైపు వెళ్లే వారు: గాంధీ చౌక్ నుండి నేరుగా వెళ్లే మార్గం కాకుండా.. గాంధీ చౌక్ → న్యూ అశోక్ టాకీస్ → GM ఆఫీస్ మీదుగా RTC బస్టాండ్ చేరుకోవాలి.
బస్టాండ్ నుండి వచ్చే వారు: RTC బస్టాండ్ నుండి గాంధీ చౌక్ వైపు వచ్చే ప్రయాణికులు కూడా తిరిగి GM ఆఫీస్ మీదుగానే ప్రయాణించాలి.
మార్కండేయ కాలనీ వాసులకు: మార్కండేయ కాలనీ నుండి గాంధీ చౌక్ వెళ్లే వారు.. మున్సిపల్ ఆఫీస్ → RTC బస్టాండ్ → GM ఆఫీస్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
అశోక్ నగర్ మార్గం: అశోక్ నగర్ నుండి వచ్చేవారు రిగల్ మీదుగా గాంధీ చౌక్ చేరుకోవచ్చు.
గమనిక: రేపు ఉదయం నుండే ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. వాహనదారులు, ప్రయాణికులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించి, ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు కోరారు.

