(MS8NEWS జనవరి 10)హైదరాబాద్/నగర ప్రాంతం:పోలీసులు ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా, ఎన్ని జరిమానాలు విధిస్తున్నా.. కొందరు ఆకతాయిల్లో మాత్రం మార్పు రావడం లేదు. చట్టం అన్నా, ఖాకీలన్నా భయం లేకుండా రోడ్లపై రెచ్చిపోతున్నారు. ‘వీలీలు’, ‘స్టోపీలు’ అంటూ ప్రాణాంతక బైక్ స్టంట్స్‌తో బెంబేలెత్తిస్తున్నారు.సాధారణంగా రాత్రి సమయాల్లో ఇలాంటి విన్యాసాలు చేసేవారు, ఇప్పుడు రూట్ మార్చారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే పగటిపూట కూడా ప్రధాన రహదారులపై విన్యాసాలు చేస్తూ తోటి వాహనదారుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు.అతి వేగంతో దూసుకురావడం.సిగ్నల్స్ దగ్గర అకస్మాత్తుగా బైక్ ముందు టైరును గాలిలోకి లేపడం.సెల్ఫీలు, రీల్స్ కోసం ప్రాణాలను పణంగా పెట్టడం.”మేము ఆఫీసులకో, పనులకో వెళ్తుంటే ఒక్కసారిగా గాలిలోకి బైక్‌లు లేపుతూ పక్క నుంచి దూసుకెళ్తున్నారు. దీనివల్ల మేము భయపడి కింద పడిపోయే పరిస్థితి వస్తోంది. వీరికి కఠిన శిక్షలు పడితేనే గానీ బుద్ధి రాదు” అని ఒక వాహనదారుడు తన ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసుల హెచ్చరిక: > “స్టంట్స్ చేస్తూ పట్టుబడితే వాహనాలను సీజ్ చేయడమే కాకుండా, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. మీ సరదా ఇతరుల ప్రాణాల మీదకు రాకూడదు.”

