(MS8NEWS జనవరి 8):గోదావరీఖని (జ్యోతి నగర్):11వ డివిజన్ జ్యోతి నగర్ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవం శ్రీ దారి మైసమ్మ అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమం గురువారం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, మనాలి ఠాకూర్ దంపతుల స్ఫూర్తితో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.ప్రజాసేవే లక్ష్యంగా, అమ్మవారిపై ఉన్న అచంచల భక్తితో స్థానిక మాజీ కార్పొరేటర్ పెద్దెల్లి తేజస్వి ప్రకాష్ తన సొంత ఖర్చులతో ఈ ఆలయాన్ని నూతనంగా నిర్మించారు. అమ్మవారి కృపతో నిర్మాణం పూర్తి కావడంతో, శాస్త్రోక్తంగా వేద మంత్రాల మధ్య విగ్రహ ప్రతిష్ఠాపన గావించారు.ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని జ్యోతి నగర్ మరియు పరిసర ప్రాంత మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలతో తరలివచ్చి అమ్మవారికి మొక్కలు సమర్పించుకున్నారు. ఆలయ ప్రాంగణం మంగళవాయిద్యాలు, భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ.. “డివిజన్ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నాను. భక్తుల సౌకర్యార్థం ఈ ఆలయాన్ని నిర్మించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను,” అని తెలిపారు.ఈ మహోత్సవంలో డివిజన్ పెద్దమనుషులు అయిందాల రాజనర్సున్న, ఇల్లందుల ఆనంద్, శనిగరపు రమేష్, సుదర్శన్, రామస్వామి, సాతురీ కృష్ణ, శంకర్, మాటూరు రాజేశ్వరి, నాతరి మల్లేష్‌తో పాటు బస్తీ ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

