(MS8NEWS జనవరి 7)గోదావరిఖని: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జనవరి 19న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించే భారీ ప్రదర్శన, బహిరంగ సభను జయప్రదం చేయాలని సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య పిలుపునిచ్చారు.బుధవారం గోదావరిఖనిలోని శ్రామిక భవన్‌లో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద చట్టాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రధాన అభ్యంతరాలు & డిమాండ్లు:29 కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం వల్ల కార్మికుల పని గంటలు పెరుగుతాయని, సామాజిక భద్రత కరువవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) పేరును మార్చడమే కాకుండా, నిధుల కేటాయింపులో కేంద్రం వాటాను 90% నుండి 60%కి తగ్గించి రాష్ట్రాలపై భారం మోపిందని విమర్శించారు.విత్తన & విద్యుత్ సవరణ బిల్లులు: 2025లో తెచ్చిన కొత్త విత్తన చట్టం వల్ల రైతులు కార్పొరేట్ కంపెనీల చేతుల్లో బందీలు అవుతారని, విద్యుత్ సవరణ చట్టం ద్వారా స్మార్ట్ మీటర్లు పెట్టి సబ్సిడీలు ఎత్తివేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.“ప్రజల హక్కులను కాలరాస్తూ, రాష్ట్రాల అధికారాలను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు కార్మికులు, రైతులు ఏకం కావాలి.” – ఎస్. వీరయ్య
జనవరి 19, 2026 పెద్దపల్లి జిల్లా కేంద్రం లో నిరసన ప్రదర్శన మరియు భారీ బహిరంగ సభ
ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు టి. రాజారెడ్డి, జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమార్ స్వామి, జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు మరియు ఇతర జిల్లా నాయకులు పాల్గొన్నారు.

