Monday, April 13, 2026

15 ఏళ్ల ఎదురుచూపులకు తెర.. 41వ డివిజన్‌లో ముగిసిన UGD పనులు!

(MS8NEWS జనవరి 6):​రామగుండం (LB నగర్):స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చొరవతో, 41వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెంటం ఉదయ్ రాజ్ నిరంతర కృషి ఫలితంగా ఎట్టకేలకు 41వ డివిజన్‌ పరిధిలోని LB నగర్‌లో ఏళ్ల కాలంగా పెండింగ్‌లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (UGD) వ్యవస్థ పనులు (ఫేస్-1) విజయవంతంగా పూర్తయ్యాయి.గత 15 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో మురుగునీరు రోడ్లపైకి చేరి నరకప్రాయంగా మారేది. ఎంతో మంది నాయకులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదు.ఈ దీర్ఘకాలిక సమస్యను డివిజన్ అధ్యక్షులు మెంటం ఉదయ్ రాజ్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే, అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయించడమే కాకుండా పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో గత వారం రోజులుగా యుద్ధ ప్రాతిపదికన జరిగిన పనులు నేటితో పూర్తయ్యాయి.

“గతంలో ఎంతోమంది హామీలు ఇచ్చి వెళ్లారు కానీ, రాజ్ ఠాకూర్ మరియు ఉదయ్ రాజ్ చెప్పిన మాట ప్రకారం పనులు పూర్తి చేయించారు” అని స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.​డివిజన్ వ్యాప్తంగా ఉన్న పెండింగ్ UGD పనులను దఫాలవారీగా పూర్తి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు.డివిజన్‌లో ఇంకా ఏవైనా ప్రజా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని మెంటం ఉదయ్ రాజ్ కోరారు.

Related Articles

Most Popular