Monday, April 13, 2026

​మహబూబాబాద్‌లో విద్యార్థినుల సమరభేరి: గేట్లు బద్దలు కొట్టి నిరసన

(MS8NEWS జనవరి 6):​మహబూబాబాద్: జిల్లాలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ఒక్కసారిగా రోడ్డెక్కారు. గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వారి సహనం కట్టలు తెంచుకుంది.నర్సింగ్ కళాశాలకు ఇప్పటి వరకు శాశ్వత భవనం కేటాయించలేదు. ప్రస్తుతం అద్దె భవనంలోనే తరగతులు నిర్వహిస్తున్నారు.అద్దె భవనంలో వసతులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, చదువుకోవడానికి, ఉండటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినులు నిరసనకు సిద్ధమవ్వగా, కళాశాల యాజమాన్యం వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. బయటకు వెళ్లకుండా గేట్లకు తాళాలు వేసి విద్యార్థినులను లోపలే నిర్బంధించింది.యాజమాన్యం నిర్బంధించడంతో ఆగ్రహానికి గురైన విద్యార్థినులు గేట్లను బద్దలు కొట్టుకుని బయటకు వచ్చారు. భారీ సంఖ్యలో రోడ్డుపైకి చేరుకుని ప్రభుత్వానికి, కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. “మాకు న్యాయం కావాలి.. సొంత భవనం కేటాయించాలి” అంటూ భీష్మించుకు కూర్చున్నారు.విద్యార్థినుల డిమాండ్: “ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అద్దె భవనాల్లో నరకం చూస్తున్నాం. మాకు తక్షణమే సొంత భవనం నిర్మించి, కనీస సౌకర్యాలు కల్పించాలి.”​ఈ ఘటనతో మహబూబాబాద్‌లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థినులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయి.

  • https://youtube.com/shorts/KnJZDz8qrNg?feature=share

Related Articles

Most Popular