(MS8NEWS జనవరి 5):పెద్దపల్లి జిల్లా:
రామగుండం సింగరేణి ఏరియా గోదావరిఖని 11 ఇన్ క్లైన్ బొగ్గు గని ని సింగరేణి డ్రెస్ కోడ్ లో సందర్శించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.ఎంపీ వంశీకృష్ణకు ఘన స్వాగతం పలికి శాలువాలతో సన్మానించిన అర్జీ1 జీఎం లలిత్ కుమార్, సింగరేణి అధికారులు.బొగ్గు గని లోనికి(అండర్ గ్రౌండ్) వెళ్లి పని స్థలాలను పరిశీలించిన ఎంపీ.గని ఆవరణలోని దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ వంశీకృష్ణ.కార్మికులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపి.సింగరేణిలో నెలకొన్న సమస్యలను ఎంపీ దృష్టికీ తీసుకెళ్లిన సింగరేణి కార్మికులు.సింగరేణి కార్మికులకు సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు, మెడికల్ బోర్డు ఏర్పాటు పై ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తో ఇప్పటికే మాట్లాడడం జరిగింది,మరో మారు వారి దృష్టికి తీసుకువెళ్తాను అనీ తెలిపారు.సింగరేణి విశ్రాంతి కార్మికులకు పదివేల రూపాయల పెన్షన్ వచ్చేలా పార్లమెంటులో ప్రస్తావించడం జరిగింది, ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ సీతారామన్ దృష్టికి తీసుకెళ్లాను.పార్లమెంట్లో అవకాశం వచ్చినప్పుడు సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడటం జరుగుతుంది.
కార్మికుల సొంతింటి కల నెరవేరేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తాను,మారుపేరుల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం.ముఖ్యంగా మహిళ కార్మికుల ఎలాంటి సమస్యలు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిన ఎంపీ వంశీకృష్ణ.నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు చేపడుతున్నాం.సింగరేణి కార్మికుల రక్షనే ధ్యేయంగా సేఫ్ అండ్ సేఫ్టీ రక్షణ చర్యలు పాటించాలని సింగరేణి అధికారులకు సూచన.

