Monday, April 13, 2026

విశ్వబ్రాహ్మణులను అన్ని విధాలుగా ఆదుకోవాలి,50 సంవత్సరాల వయసు వారికి పెన్షన్ ఇవ్వాలి.సీఎం రేవంత్ రెడ్డి కి వినతి పత్రం ఇచ్చిన రామగుండం ఏం.ఎల్.ఏ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ …

(MS8NEWS జనవరి 4): రాష్ట్రవ్యాప్తంగా విశ్వబ్రాహ్మణులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు& రామగుండం శాసనసభ్యులు ఎం ఎస్ రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే శనివారం మర్యాద పూర్వకంగా కలిసి విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రం అందించారు. ప్రధానంగా విశ్వబ్రాహ్మణులకు 50 సంవత్సరాల వయసు వారికి పెన్షన్ ఇవ్వాలని కోరారు. అలాగే పుస్తె- మట్టలు తయారీ విషయంలో కేవలం వారికే అవకాశం ఇవ్వాలన్నారు. జువెల్లరీ షాపులలో వీటిని అమ్మకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. విశ్వబ్రాహ్మణులు ప్రధానంగా సూక్ష్మ పరంగా(కంటిచూపు) పనులు నిర్వహిస్తారన్నారు. అందుకే కేవలం వీరి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రభుత్వ పరంగా ఉపాధి, భద్రతా కల్పించాలని సీఎం ను కోరారు. ఆయన వెంట పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, దానం నాగేందర్ తదితరులు ఉన్నారు.

Related Articles

Most Popular