(MS8NEWS జనవరి 1): రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే.సీ.ఆర్. ప్రజాసమస్యల పరిష్కారం దిశగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, గత సంవత్సర కాలంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు, శ్రేణులు పోరాడి సాధించిన విజయాలను ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారుతెలంగాణ ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు చిత్తశుద్ధితో, రాజీలేని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ, నూతన సంవత్సరంలో రెట్టించిన పట్టుదలతో తమకు ప్రజలు అప్పగించిన బాధ్యతను నిర్వహిస్తుందని కేసీఆర్ తెలిపారు.నూతన సంవత్సరంలో వ్యవసాయ, సాగునీటి రంగాలు గాడినపడి.. అభివృద్ధి చెందాలని, తెలంగాణ రైతాంగం, మహిళలు, సకల జనులు, సుఖసంతోషాలతో జీవించాలని కేసీఆర్ కోరుకున్నారుతాము నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకుంటూ యువత, పలు రంగాలకు చెందిన వృత్తి నిపుణులు, తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కేసీఆర్ ఆకాంక్షించారు

