Sunday, April 12, 2026

నిస్సహాయ వృద్ధులకు ఆర్థిక సహాయం..

పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ ప్రాంతానికి చెందిన నిస్సహాయ కుటుంబమైన గాండ్ల .రాజం -మల్లమ్మ దంపతులకు వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం కమాన్ పూర్ సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్, వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ డా, సురభి శ్రీధర్ చేతుల మీదుగా అందించడం జరిగింది. అనంతరం సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్ మాట్లాడారు. వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. సంస్థ కార్పొరేషన్ 56డివిజన్ ఆర్గనైజర్ గడవేన సదానందం సతీమణి గడవేన సునిత జన్మదినం పురస్కరించుకొని కమాన్ పూర్ ప్రాంతానికి చెందిన గాండ్ల రాజం- మల్లమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు తమ తమపెళ్లిరోజు పుట్టినరోజుల సందర్భంగా నిస్సహాయులకు, నిర్భాగ్యులకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని అన్నారు.అనంతరం నూతనంగా కమాన్ పూర్ సర్పంచ్ గా ఎన్నికైన రంగు సత్యనారాయణ గౌడ్ కు వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ ఆర్గనైజర్ గడవేన సదానందం-సునీత పెద్దపల్లి జిల్లా సంస్థ మహిళా విభాగం అధ్యక్షురాలు భూపెల్లి జ్యోతి, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం కమాన్ పూర్ గౌరవ అధ్యక్షులు భూపెల్లి. మల్లేష్, ఆది వరహాస్వామి ఆలయ మాజీ డైరెక్టర్ బొజ్జ నరసింహ చారి. మెడిటేషన్ నిర్వాహకులు తాళ్ళ శంకర్, తో పాటు జక్కుల కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Most Popular