Monday, April 13, 2026

వైకుంఠ ఏకాదశి పూజలో పాల్గొన్న రామగుండం ఏం.ఎల్.ఏ సతీమణి మనాలి ఠాగూర్..

(MS8NEWS డిసెంబర్ 30): వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రామగుండం శాసనసభ్యులు  MS రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ గోదావరిఖని ప్రాంతంలోని శ్రీ రామ మందిరంలో నిర్వహించిన వైకుంఠ ఏకాదశి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ నిర్వాహకులను, భక్తులను పలకరించి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గట్ల రమేష్ దంపతులు మరియు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

Most Popular