(MS8NEWS డిసెంబర్ 29): ఎర్నాకులం – టాటానగర్ ఎక్స్‌ప్రెస్ (నెం. 18189) ,అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో B1 ఏసీ కోచ్‌లో మొదట మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా పక్కనే ఉన్న M2 కోచ్‌కు కూడా వ్యాపించాయి.మంటలను గమనించిన ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై రైలు చైన్ లాగారు. రైలు ఆగగానే భయాందోళనతో ప్రయాణికులు కిందకు దిగి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది మరియు అగ్నిమాపక దళం ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా రైల్వే సిబ్బంది మంటలు అంటుకున్న బోగీలను మిగతా రైలు నుండి వేరు చేశారు.ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు, కానీ ప్రయాణికులకు సంబంధించిన లగేజీ బ్యాగులు, ఇతర వస్తువులు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి.ప్రస్తుతం రైల్వే అధికారులు ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై విచారణ చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

