Monday, April 13, 2026

తెలంగాణ జిల్లాలను వణికిస్తున్న చలి!

(MS8NEWS డిసెంబర్ 29):తెలంగాణలో చలి తీవ్రత పెరిగిపోయింది. అనేక జిల్లాల్లో 10 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు రికార్డవుతు న్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. ఉదయం ఎండ వచ్చేవరకు బయటకు రావాలంటేనే భయపడు తున్నారు. చలితీవ్రత ఎప్పటికీ తగ్గుముఖం పడుతుందోనని జనాలు ఎదురుచూస్తున్నారు.అయితే, చలి తీవ్రత ఇప్పట్లో తగ్గేలా లేదు. సోమ, మంగళవారాల్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ లోని 14 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఆయా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.కుమురం భీం ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో నిన్న ఆదివారం ఉష్ణోగ్రతలు 7.5 డిగ్రీల లోపు నమోదయ్యా యి. అలాగే,సోమ, మంగళవారం, కామారెడ్డి, మెదక్‌, నిర్మల్‌, వికారాబా ద్‌, సిద్దిపేట, హైదరాబాద్‌, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌, జగిత్యాల, మహబూబ్‌ నగర్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, జయశంకర్‌భూపాలపల్లి జిల్లాల్లో చలి తీవ్రత అధికం గా ఉంటుందని,వాతావరణ శాఖ వెల్లడించింది.

Related Articles

Most Popular