Thursday, June 4, 2026

పెద్దపల్లి సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన డీసీపీ బి. రామ్ రెడ్డి..

(MS8NEWS డిసెంబర్ 27) :రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాన్ని శనివారం పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించి, రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని క్రైమ్ రికార్డులు, ప్రాపర్టీ రిజిస్టర్, పిటిషన్ రిజిస్టర్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.

​నాణ్యమైన దర్యాప్తుతోనే శిక్షలు ఖరారు,​తనిఖీ అనంతరం అధికారులను ఉద్దేశించి డీసీపీ మాట్లాడుతూ పలు కీలక సూచనలు చేశారు,పెండింగ్‌లో ఉన్న గ్రేవ్ కేసులు, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల సీడీ ఫైళ్లను పరిశీలించి, ఫోక్సో (POCSO) వంటి తీవ్రమైన కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా నాణ్యమైన దర్యాప్తు (Quality Investigation) చేయాలని ఆదేశించారు. ప్రతి కేసు దర్యాప్తులో నిర్ణీత స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) పాటించాలని స్పష్టం చేశారు. సర్కిల్ పరిధిలోని రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు.

​ప్రజా రక్షణ – సామాజిక అవగాహన​శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలకు మరింత చేరువ కావాలని డీసీపీ పేర్కొన్నారు, డయల్ 100 ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, గ్రామాల్లో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని సీఐని ఆదేశించారు. సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, సామాజిక అంశాలపై ప్రజలకు నిత్యం అవగాహన కల్పించాలని కోరారు.’కమ్యూనిటీ పోలీసింగ్’లో భాగంగా ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను వివరించి, వాటిని ఏర్పాటు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలన్నారు.​ఈ తనిఖీ కార్యక్రమంలో పెద్దపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, పెద్దపల్లి ఎస్సై లక్ష్మణరావు, రూరల్ ఎస్సై మల్లేశం మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Most Popular