Monday, April 13, 2026

పవర్ హౌస్ కాలనీలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఏం.ఎల్.ఏ రాజ్ ఠాకూర్…

(MS8NEWS డిసెంబర్ 26):రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పవర్ హౌస్ కాలనీ (నూతన 4వ డివిజన్)లో ప్రజల సౌకర్యార్థం భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు,డివిజన్ అధ్యక్షులు *ఎం.డి. నాజీముద్దీన్* ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.సుమారు 70 లక్షల రూపాయల ట్రాన్స్ఫర్ డ్యూటీ నిధులతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..నగరాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, కాలనీల్లో నెలకొన్న మౌలిక వసతుల కొరతను దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు.​ఎంతో కాలంగా పవర్ హౌస్ కాలనీ వాసులు డ్రైనేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని, ఈ కొత్త అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు.పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.​ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ప్రణాళికాబద్ధంగా డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వేగోళపు రమాదేవి శ్రీనివాస్, సీనియర్ నాయకులు ముస్తఫా, మందపెల్లి సతీష్, వసంత, మౌనిక, కల్యాణ్, ఆరిఫ్ బాబా, వినోద్, విశాల్ సింగ్, డివిజన్ పెద్ద మనుషులు చిప్ప రాజయ్య, ధనుంజయ్, భద్రయ్య, నెగురు నర్సయ్య, కిషన్ రావు, చంద్రయ్య మరియు మహిళలు అధిక సంఖ్య లో పాల్గొనారు.

Related Articles

Most Popular