Monday, April 13, 2026

గోదావరిఖని లో అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ..!

(MS8NEWS డిసెంబర్ 25):భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి జయంతిని పురస్కరించుకొని ఈరోజు గోదావరిఖని పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో లక్ష్మీ నగర్ మండల అధ్యక్షులు ఉరకొండ అపర్ణ  ఆధ్వర్యంలో  జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రామగుండం ఇంచార్జీ కందుల సంధ్యారాణి హాజరై అటల్ బిహారీ వాజ్ పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ, అటల్ బిహారీ వాజ్ పేయి దేశానికి అంకితభావంతో సేవ చేసిన మహానాయకుడని అన్నారు. కవిగా, వక్తగా, రాజకీయ నాయకుడిగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, రాజకీయాల్లో విలువలు, నిజాయితీ, ప్రజాసేవకు ప్రతీకగా ఆయన నిలిచారని తెలిపారు.ప్రధానిగా ఉన్న సమయంలో గ్రామీణ రహదారులు, జాతీయ రహదారి అభివృద్ధి, స్వర్ణ చతుర్భుజి వంటి పథకాలతో దేశ అభివృద్ధికి బలమైన పునాది వేశారని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా అందరి గౌరవం పొందిన నాయకుడు అటల్ జీ అని పేర్కొన్నారు.అటల్ బిహారీ వాజ్ పేయి ఆలోచనలు, సిద్ధాంతాలు నేటి యువతకు మార్గదర్శకమని, ఆయన చూపిన మార్గంలోనే బిజెపి పార్టీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తోందని సంధ్యారాణి అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అటల్ జీకి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య మరియు సీనియర్ నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్,సులువ లక్ష్మీనరయ్య,పిడుగు కృష్ణ, మచ్చ విశ్వాస్,కుమ్మరి మల్లేష్,అందే రాజ్ కుమార్, పంగ రవి,అంకరి భరత్, మాదరబోయిన రాకేష్, గంగరాజు,మీస వికాస్,జక్కుల పద్మ,వంశీ,ఏరుకొండ తిరుపతి,హనుమాన్ల వెంకటేష్,కళ్యాణ్, జక్కుల ప్రవీణ్,బుంగ మహేష్ తదితరులు పాల్గొన్నారు…

Related Articles

Most Popular