(MS8NEWS డిసెంబర్ 25):సిరి శెట్టి మల్లేష్ కుటుంబానికి న్యాయం చేయాలి – అభివృద్ధి పేరుతో కూల్చివేతలు తగదు.. బిజెపి రామగుండం ఇంచార్జ్ కందుల సంధ్యారాణి.
ఇటీవల గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో అక్రమంగా కూల్చివేసిన సిరి శెట్టి మల్లేష్ కుటుంబానికి అండగ బిజెపి రామగుండం ఇంచార్జ్ కందుల సంధ్యారాణి నిలిచారు.ఎమ్మెల్యే సూచనల మేరకు మున్సిపల్ అధికారులు సిరి శెట్టి మల్లేష్ జీవనాధారమైన ఇల్లును కూల్చివేయడంతో, మల్లేష్ కుటుంబంతో సహా అదే ప్రదేశంలో టెంట్ వేసుకుని న్యాయపోరాటానికి దిగారు. ఈ పోరాటానికి సంఘీభావంగా ఈరోజు సంధ్యారాణి అక్కడికి చేరుకొని తమ మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ, రామగుండం ఎమ్మెల్యే మల్లేష్ కుటుంబానికి ఆధారమైన ఇల్లును కూల్చివేసి వారిని రోడ్డుమీదికి తీసుకొచ్చారని తీవ్రంగా విమర్శించారు. అభివృద్ధి అంటే నిర్మాణాలు జరగాలి కానీ కూల్చివేతలే ఎజెండాగా పెట్టుకుని ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం కాదని అన్నారు.రామగుండం ప్రజల పరిస్థితి కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెట్టినట్టుగా మారిందని వ్యాఖ్యానించారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించినా వారినే రకరకాలుగా వేధిస్తూ శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు. రామగుండంలో ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యేలా వారి పాలన సాగుతోందని ఆరోపించారు.మల్లేష్ కు తక్షణమే న్యాయం చేయాలని, కూల్చివేసిన అదే స్థలంలో మళ్లీ షాపు/ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు ఊరగొండ అపర్ణ,గుండబోయిన భూమయ్య మరియు సీనియర్ నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్,సులువ లక్ష్మీనరయ్య,పిడుగు కృష్ణ, మచ్చ విశ్వాస్,కుమ్మరి మల్లేష్,అందే రాజ్ కుమార్, పంగ రవి,అంకరి భరత్, మాదరబోయిన రాకేష్, గంగరాజు,మీస వికాస్,జక్కుల పద్మ,వంశీ,ఏరుకొండ తిరుపతి,హనుమాన్ల వెంకటేష్,కళ్యాణ్,బుంగ మహేష్ తదితరులు పాల్గొన్నారు…

