(MS8NEWS డిసెంబర్ 19) :న్యూఢిల్లీలో జరిగిన జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ (NCSC) మరియు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం…
ఈ సమావేశం ప్రధానంగా ఎస్సీ (SC) ఉద్యోగుల సంక్షేమం మరియు వారికి రాజ్యాంగబద్ధంగా అందవలసిన హక్కుల అమలుపై దృష్టి సారించింది.కిషోర్ మక్వానా జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ అధ్యక్షతన జరిగిన సమావేశం లో సభ్యులు వడ్డేపల్లి రాంచందర్ సభ్యులు,NCSC,లవ్ కుష్ కుమార్ సభ్యులు, NCSC.జి. శ్రీనివాస్: కార్యదర్శి, NCSC.అశోక్ చంద్ర: మేనేజింగ్ డైరెక్టర్ & CEO, పంజాబ్ నేషనల్ బ్యాంక్.వీరితో పాటు కమిషన్ మరియు బ్యాంక్ యొక్క ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.
సమావేశంలో ఎస్సీ ఉద్యోగులకు సంబంధించి ప్రధానాంశాలపై సమీక్ష నిర్వహించారు. ఎస్సీ ఉద్యోగులకు సకాలంలో అందవలసిన పదోన్నతుల ప్రక్రియను పర్యవేక్షించడం. రిజర్వేషన్ రోస్టర్ పక్కాగా అమలు అవుతుందా లేదా అన్న అంశంపై చర్చ. పెండింగ్‌లో ఉన్న ఎస్సీ కేటగిరీ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆదేశం.ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాల ఫలాలు లబ్ధిదారులకు చేరుతున్న తీరు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే యంత్రాంగం పనితీరును మెరుగుపరచడం.సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆర్టికల్ 338 ప్రకారం ఈ కమిషన్ దేశవ్యాప్తంగా షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తోంది అనీ తెలిపారు.

