Thursday, February 12, 2026

మక్కాన్ సింగ్ పై తీవ్రమైన ఆరోపణలు చేసిన వ్యాల హరీష్ రెడ్డి..

(MS8NEWS డిసెంబర్ 19): రామగుండం ఎమ్మెల్యే మరియు ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రామగుండం ఎమ్మెల్యే అక్రమంగా ఫ్లై యాష్ (బూడిద) రవాణా చేస్తూ కోట్లాది రూపాయలు గడిస్తున్నారని ఆరోపించారు. రోజుకు వందలాది లారీలతో ఈ అక్రమ రవాణా సాగుతోందని పేర్కొన్నారు.

ఫ్లై యాష్‌ను స్థానిక చెరువులు, కుంటల్లో కలపడం వల్ల పర్యావరణం దెబ్బతింటోందని, దీనివల్ల మత్స్యకారులు మరియు స్థానిక గ్రామ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

​ సింగరేణి సంస్థకు చెందిన సుమారు 10 కోట్ల రూపాయల నిధులను మెస్సి మరియు ముఖ్యమంత్రికీ సంబంధించిన ఫుట్‌బాల్ ఈవెంట్ కోసం ఖర్చు చేశారని, కానీ స్థానిక సమస్యల పరిష్కారానికి నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు.గత కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం “రైతు భరోసా” అందించడంలో విఫలమైందని మండిపడ్డారు. బాధితులకు తక్షణమే పరిహారం చెల్లించాలని, అక్రమ రవాణాను అరికట్టాలని మరియు పర్యావరణాన్ని కాపాడాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

Related Articles

Most Popular