Monday, April 13, 2026

రామగుండం పోలీస్ కమిషనరేట్ సందర్శించిన మల్టీజోన్–I ఐజి. పంచాయతీ ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై సమీక్ష…. పోలీస్ కమీషనర్ నూతన గృహ నిర్మాణ పనుల పరిశీలన.

 

(MS8NEWS డిసెంబర్ 17)మల్టీ జోన్ –1 ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి రామగుండం పోలీస్ కమిషనరేట్‌ను సందర్శించారు. పోలీస్ కమిషనర్ రేట్ చేరుకున్న ఐజి ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆర్ముడ్ సాయిధ దళ సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించి , సీపీ కార్యాలయం లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ, చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు, సున్నిత/సాధారణ పోలింగ్ ప్రక్రియ, ఫలితాల వివరాలు, కమీషనరేట్ పరిధిలో శాంతి భద్రత పరిరక్షణ, నేర నియంత్రణ కోసం చేపట్టుతున్న ముందస్తు చర్యలపై తదితర అంశాలపై సీపీ  తో చర్చించడం జరిగింది. శాంతి భద్రత పరిరక్షణలో ఎటువంటి రాజీపడకూడదు. నేరాల నివారణకు ఇంటెలిజెన్స్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. అదేవిధంగా పోలీస్ అధికారులు, సిబ్బంది క్రమశిక్షణ, ప్రజలతో సమన్వయం, గ్రామలను సందర్శించి, ఇన్ఫర్మేషన్ వ్యవస్థ, నిఘా బలోపేతం చేయాలని ఐజి సూచించారు.తర్వాత కమిషనరేట్ పరిధిలో నిర్మాణం దశ లో ఉన్నారు పోలీస్ కమీషనర్ నివాస గృహ నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై వివరాలు తెలుసుకొన్నారు. పనులు నాణ్యతతో, నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని సూచించారు.

Related Articles

Most Popular