MS8NEWS డిసెంబర్ 17 : రామగుండం నియోజకవర్గం లో అభివృద్ధిలో భాగంగా పలు ప్రాంతాల్లో పర్యటించిన ఏం.ఎస్. రాజ్ ఠాకూర్.ఈ సందర్భంగా సమ్మక్క–సారలమ్మ గద్దెల పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించి, పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో చర్చించారు. ప్రజల విశ్వాసాలకు, సంప్రదాయాలకు అనుగుణంగా నాణ్యమైన నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు.అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల కోసం కేటాయించిన స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించి, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించే దిశగా త్వరితగతిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.తదుపరి వైకుంఠ ధామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు, అక్కడి సౌకర్యాలు, నిర్వహణ అంశాలను పరిశీలించి అవసరమైన అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

