గోదావరిఖని బస్టాండ్ వద్ద ఉన్న ఆటో యూనియన్ అడ్డాలో ఆటోల పార్కింగ్ సమస్యపై రామగుండం శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ డిపో మేనేజర్ తో చర్చించారు.ఈ సందర్భంగా బస్టాండ్‌లోకి లోపలికి–బయటకు వెళ్లే బస్సులకు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆటోల పార్కింగ్ నిర్వహించాలన్నారు. క్రమబద్ధమైన పార్కింగ్ విధానాన్ని పాటిస్తూ, ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా సహకరించాలని ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు.ప్రజల సౌకర్యమే ప్రధాన లక్ష్యంగా అందరూ బాధ్యతతో వ్యవహరించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లను కోరారు..

