Monday, April 13, 2026

ప్రజా సమస్యలే అజెండాగా బరిలోకి “చిదురాల నాగరాజు” 52వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా ఘనంగా నామినేషన్ దాఖలు

MS8NEWS జనవరి 30 గోదావరిఖని : 52వ డివిజన్అ భివృద్ధియే లక్ష్యంగా, ప్రజల ఆశీస్సులతో 52వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా చిదురాల నాగరాజు ఈరోజు తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు, మద్దతుదారుల మధ్య ఆయన ఎన్నికల అధికారికి పత్రాలను అందజేశారు.

నామినేషన్ అనంతరం నాగరాజు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు: రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజల సంక్షేమమే తన ప్రథమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. అవినీతి రహిత, పారదర్శకమైన పాలన అందిస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు. ప్రతి ఇంటి సమస్యను తన సొంత సమస్యగా భావించి, వార్డు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు.

“ఇది కేవలం ఒక వ్యక్తి పోటీ కాదు, ఇది మన ప్రాంత స్వాభిమానం కోసం సాగిస్తున్న పోరాటం. మార్పు మన ఓటుతోనే మొదలవుతుంది. మన ప్రాంత భవిష్యత్తు కోసం, స్వతంత్ర అభ్యర్థిగా నాకు మద్దతు తెలపాలని కోరుతున్నాను,” అని నాగరాజు పిలుపునిచ్చారు.వార్డు పరిధిలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన.సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా చూడటం.నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే ‘ప్రజా ప్రతినిధి’గా వ్యవహరించడం.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువత మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని నాగరాజుకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ‘జై ప్రజాస్వామ్యం – జై మన ప్రాంతం’ నినాదాలతో నామినేషన్ కేంద్రం మార్మోగింది.

Related Articles

Most Popular