మేడారం మహా జాతర: సమ్మక్క ఆగమనం – వనం నుంచి జనంలోకి వనదేవత
మేడారం మహా జాతరలో అత్యంత కీలకమైన, ఉద్వేగభరిత ఘట్టం ఆసన్నమైంది. లక్షలాది మంది భక్తులు వేయీ కళ్లతో ఎదురుచూస్తున్న సమ్మక్క తల్లి ఆగమనం. చిలుకలగుట్ట నుంచి తల్లి గద్దెపైకి చేరడంతో జాతర పతాక స్థాయికి చేరుకుంటుంది.
-
కుంకుమ భరణి రూపంలో అమ్మవారు: చిలుకలగుట్టపై పూజలు నిర్వహించిన అనంతరం, ఆదివాసీ పూజారులు సమ్మక్క తల్లిని కుంకుమ భరణి రూపంలో మేడారం గద్దెల పైకి తీసుకువస్తారు.
-
గాలిలోకి కాల్పులు: సమ్మక్క తల్లికి గౌరవ సూచికగా జిల్లా ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి అధికారికంగా స్వాగతం పలుకుతారు.
-
భద్రతా ఏర్పాట్లు: భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చిలుకలగుట్ట నుండి గద్దెల వరకు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
కొలువుదీరిన దేవతలు: ఇప్పటికే గద్దెలపై సమ్మక్క కుమార్తె సారలమ్మ, భర్త పగిడిద్దరాజు, అల్లుడు గోవిందరాజుల ప్రతిరూపాలు కొలువుదీరాయి. నేడు తల్లి రాకతో కుటుంబమంతా ఏకమవుతుంది. భక్త జనసంద్రం:తెలంగాణ నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా నుండి లక్షలాది మంది భక్తులు మేడారానికి తరలివచ్చారు. “జై సమ్మక్క.. జై సారలమ్మ” అనే నామస్మరణతో అడవి మార్గాలన్నీ ప్రతిధ్వనిస్తున్నాయి. నిన్న సాయంత్రం తల్లి గద్దెపైకి చేరుకోగానే భక్తులు మొక్కులు సమర్పించుకోవడానికి బారులు తీరనున్నారు.

