Monday, April 13, 2026

4వ డివిజన్ అభివృద్ధికి నూతన శకం: కార్పోరేటర్ అభ్యర్థిగా కంకణాల మౌనిక రాజు! ​ప్రజాసేవే పరమావధిగా.. మీ ఇంటి ఆడబిడ్డ మీ ముందుకు..

MS8NEWS జనవరి 18: 4వ డివిజన్ ప్రజలారా, డివిజన్ అభివృద్ధికి, సంక్షేమానికి ఒక సరికొత్త నాయకత్వం అవసరమైన సమయం ఆసన్నమైంది. 4వ డివిజన్ జనరల్ మహిళా రిజర్వేషన్‌గా కేటాయించబడిన తరుణంలో, మీ కష్టసుఖాలు తెలిసిన మీ ఇంటి ఆడబిడ్డ కంకణాల మౌనిక రాజు కార్పోరేటర్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.

మన డివిజన్ – మన బాధ్యత అనీ ​మెరుగైన మౌలిక వసతులు డివిజన్‌లోని ప్రతి వీధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ మరియు వీధి దీపాల ఏర్పాటు.

సురక్షిత మంచినీరు: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన మంచినీరు అందేలా శాశ్వత పరిష్కారం.

మహిళా సాధికారత: డివిజన్ పరిధిలోని మహిళల కోసం స్వయం ఉపాధి పథకాలు మరియు కుట్టు శిక్షణ కేంద్రాల ఏర్పాటు.

ఆరోగ్యం & పరిశుభ్రత: పారిశుధ్య కార్మికుల పర్యవేక్షణ, దోమల నివారణ మరియు చెత్త సేకరణ క్రమబద్ధీకరణ.

​అందుబాటులో ఉండే నాయకత్వం: కార్యాలయం చుట్టూ తిరిగే పని లేకుండా, సమస్య తెలిసిన వెంటనే స్పందించే తత్వం.

​రాజకీయాలు అంటే కేవలం పదవి కాదు, అది ఒక బాధ్యత అని నమ్మి.. గత కొన్నేళ్లుగా ప్రజల మధ్య ఉంటూ, నిస్వార్థంగా సేవలందిస్తున్న వ్యక్తి మౌనిక రాజు . కేవలం ఎన్నికల సమయంలో వచ్చే నాయకురాలు కాదు, ఎల్లప్పుడూ మీ పిలుపు కోసం ఎదురుచూసే మీ కుటుంబ సభ్యురాలు.

​ రాబోయే ఎన్నికలలో మీ అమూల్యమైన ఓటును కంకణాల మౌనిక రాజు కీ వేసి, అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నారు.

Related Articles

Most Popular