రామగుండం: రామగుండం నగరపాలక సంస్థలోని 39వ డివిజన్ (శివాజీనగర్) ఇప్పుడు రాజకీయంగా వేడెక్కింది. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా గెలుపొంది, తనదైన ముద్ర వేసిన తోట అనసూయ మరోసారి ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. శివాజీనగర్ గడ్డపై తనదైన సేవా కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందుతున్నారు.తమ ప్రాంతానికి సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారు. మొదటిసారి పోటీ చేసినప్పుడే శివాజీనగర్ ప్రజలు వారీ నిజాయితీని నమ్మి భారీ మెజారిటీతో గెలిపించారు.
ఐదేళ్లలో సాధించిన ప్రగతి:గత తన హయాంలో తోట అనసూయ అనేక సంక్షేమ కార్యక్రమాలను నేరుగా ప్రజల వద్దకు చేర్చారు.
రేషన్ & పెన్షన్: సుమారు 800 కొత్త రేషన్ కార్డులు, 600 పెన్షన్లు మంజూరు చేయించారు.
గ్యాస్ కనెక్షన్లు: 400 గ్యాస్ సిలిండర్ కనెక్షన్లను ప్రజలకు అందజేశారు.
వైద్యం & విద్య: పేద విద్యార్థులకు సోషల్ వెల్ఫేర్ స్కూళ్లలో సీట్లు ఇప్పించడంతో పాటు, ఆసుపత్రి బిల్లుల తగ్గింపులో కీలక పాత్ర పోషించారు.
మౌలిక సదుపాయాలు: సొంతంగా మీ-సేవ సెంటర్ ఏర్పాటు చేసి కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు సులభంగా అందేలా చేశారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “ప్రజా పాలన” పేరుతో అబద్ధపు వాగ్దానాలు చేస్తూ జనాన్ని వంచిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా నిరుపేదల ఇళ్లను కూల్చివేయడం, జేసీబీలతో భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని ఆయన అన్నారు. “YSR పట్టా ఉన్న ఇళ్లను కూడా వదలడం లేదు, ఇది దుర్మార్గం” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాబోయే ఎన్నికలే లక్ష్యం
మున్సిపల్ 39వ వార్డు ఉప ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, మరోసారి తనను దీవించాలని ఆయన ప్రజలను కోరుతున్నారు. రాజయోగం ఉన్న నాయకురాలిగా తోట అనసూయ నిలబడుతున్నట్లు సూచనప్రాయంగా తెలియజేశారు. “శివాజీనగర్ గడ్డ – తోట అడ్డా” అనే నినాదంతో ఆయన ముందుకు సాగుతున్నారు.

