Wednesday, February 11, 2026

తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాలు?*

(MS8NEWS జనవరి 7):*తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాలు?*

 తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి, రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావానికి బీజం పడింది తెలంగాణ జాగృతి అధ్యక్షులు ఎమ్మెల్సీ కవిత త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం దాదాపు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది, వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీ తరపున పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేయడంతో తెలంగాణ రాజకీయ సమీకరణలు మారే అవకాశాలపై విశ్లేషణలు మొదలయ్యాయి…..  

 

తెలంగాణ జాగృతిని రాజకీయ వేదికగా కొనసాగిస్తారా?లేక పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారుస్తారా? అనే సందేహాలకు ఆమె ప్రసం గాలు స్పష్టతనిచ్చాయి వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తప్పకుండా పోటీ చేస్తానని చెప్పడం ద్వారా కొత్త రాజకీయ పార్టీ రానుందన్న సంకేతాన్ని బలంగా ఇచ్చారు. కవిత కాంగ్రెస్ లో చేరిన ఆశ్చర్య పోనక్కర్లేద ని కాంగ్రెస్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ చర్చలకు మరింత బలం చేకూరాయి.. ఆయన చేసిన వాక్యాలు రాజకీయ వర్గంలో తీవ్ర చర్చకు దారితీసాయి.. నిన్న మొన్నటి వరకు ఆమె టార్గెట్ హరీశ్‌రావు. అప్పుడప్పుడు కేటీఆర్‌పై అటాక్. మధ్యలో సంతోష్‌ పై సెటైర్లు. కానీ ఇప్పుడు కవిత అక్క..డైరెక్ట్‌గా గులాబీ బాస్‌పైనే బాణాలు ఎక్కు పెడుతోంది. పెద్ద సార్ టార్గెట్‌గానే..ఇంకా చెప్పా లంటే కల్వకుంట్ల ఫ్యామిలీ లక్ష్యంగానే ఆమె రాజకీయ పోరాటం ఉండబోతుంద న్నది చెప్పకనే చెప్పేస్తోంది. కానీ కవిత కామెంట్స్‌పై కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి మాత్రం నో రియాక్షన్. కవిత రోజు రోజుకు డోస్ పెంచుతున్నా బీఆర్ఎస్‌ కీలక నేతలెవరూ స్పందించడం లేదు. ఇదే ఇప్పుడు కారు పార్టీలో హాట్ టాపిక్‌గా మారు తోంది.కారులో ఉన్నప్పుడే అందరినీ కార్నర్ చేసింది. ఒక్క అధినేతను వదిలిపెట్టి..హరీశ్, కేటీఆర్, సంతోష్‌ను..వరుసపెట్టి అటాక్ చేస్తూ వచ్చింది కవిత. ఇక బీఆర్ఎస్‌కు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాక..ఆమె విమర్శల దాడి ఇంకా ఎక్కువైంది. ఎక్కడికెళ్లినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులే టార్గెట్ గా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు కవిత.బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు నేరుగా తీసుకోక పోయినా ఆయనపై విమర్శలు చేశారు కవిత. శాసనమండలి సాక్షిగా కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాలనపై సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పాలన అంతా అవినీతిమయం అంటూ పరోక్షంగా కేసీఆర్‌ను కార్నర్ చేసే ప్రయత్నం చేశారు కవిత. తెలంగాణను ఏం ఉద్దరించామని టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాలకు వెళ్లారంటూ మండలిలో ఉచ్చరించకూడని భాషతో తండ్రి కేసీఆర్‌ను ప్రశ్నించారామె.

 *బిఆర్ఎస్ నేతల మౌనం వెనుక అంతర్యం ఏమిటి?*

కవిత వ్యాఖ్యలు, ఆమె చేసిన ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కొంత నష్టాన్ని కలిగిస్తాయని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారట. ఆమె శాసన మండలిలో కన్నీళ్లు పెట్టుకుని మరీ అధినేత కేసీఆర్ సహా పార్టీపై, తొమ్మిదిన్నరేళ్ల పాలనపై ఆరోపణలు చేయడంపై గులాబీ లీడర్లు ఆందోళన చెందుతున్నారట. కవిత ఇంతలా సీరియస్ కామెం ట్స్ చేసినా..అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎందుకు రియాక్ట్ కావడం లేదన్నది బీఆర్ఎస్ నేతలకు, క్యాడర్‌కు అంతుచిక్కడం లేదట.కవిత వ్యాఖ్యలపై పార్టీ నుంచి ఎంత మంది మాట్లాడినా ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు స్పందిస్తే ఎఫెక్ట్ వేరేగా ఉంటుందని చర్చించుకుంటున్నారట. లేకపోతే బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అయోమయా నికి గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఇదే సమయంలో కవిత ఆరోప ణలను అధినేత కేసీఆర్ కాకపోయినా కనీసం కేటీఆర్, హరీశ్‌రావు ఖండించకపోతే పార్టీకి నష్టం జరగడంతో పాటు ప్రత్యర్ధి రాజకీయ పార్టీలకు అస్త్రాలుగా మారతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంద ట.పార్టీ మహిళా నేతలతో కవితకు కౌంటర్ ఇప్పించినా అది ప్రజల్లోకి వెళ్లదని, కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ రావుపై ఆమె ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి వాళ్లు సమాధానం చెప్తేనే బాగుం టుందన్న ఒపీనియన్స్ వస్తున్నాయట. అయితే కవిత అంతలా ఫ్యామిలీ మెంబర్స్‌ను టార్గెట్ చేస్తున్నా వాళ్లు మౌనంగా ఉండటం వెనుక ఆంతర్యం వేరే ఉందన్న టాక్ వినిపిస్తోంది. కవిత ఎంత కాదనుకున్నా తమ కుటుంబ సభ్యురాలేనని, అధినేత కేసీఆర్ కూతురు కాబట్టి..ఆమె ఎన్ని ఆరోప ణలు చేసినా కేటీఆర్, హరీశ్‌రావు మౌనంగా ఉండాల్సి వస్తోందట.

Related Articles

Most Popular