గోదావరిఖని పట్టణానికి చెందిన సిటీ కేబుల్ కెమెరామెన్ శ్రీనివాస్ కూతురు శ్రావ్య ఈరోజు ఉదయం గుండెపోటుతో అకాల మరణం చెందడం అత్యంత విషాదకరం. ఈ విషయం తెలుసుకున్న వెంటనే రామగుండం శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ గాంధీ నగర్లోని వారి నివాసానికి వెళ్లి శ్రావ్య పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ దుఃఖ సమయంలో తాము ఎల్లప్పుడూ వారి వెంట ఉంటామని భరోసా కల్పించారు. నీవాళులు అర్పించిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులున్నారు..

