Monday, April 13, 2026

సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం: తుని సమీపంలో నిలిచిన రైలు

MS8NEWS జనవరి 20:తుని: విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్తున్న సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం. 17240)లో మంగళవారం సాంకేతిక లోపం తలెత్తింది. తుని సమీపంలోని హంసవరం వద్ద రైలు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.కాకినాడ జిల్లా, తుని మండలంలోని హంసవరం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతం.రైలు హంసవరం దాటుతున్న సమయంలో ఇంజిన్ భాగం నుండి దట్టమైన పొగలు రావడం గమనించిన లోకో పైలట్, అప్రమత్తమై రైలును నిలిపివేశారు. సాంకేతిక కారణాల వల్ల గత 2 గంటలుగా రైలు అక్కడే నిలిచిపోయింది.

ప్రయాణికుల ఇబ్బందులు:రైలు నడిరోడ్డుపై నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వేసవి కాలం కావడంతో మంచి నీరు, ఆహారం దొరక్క వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు. గుంటూరు, విజయవాడ వెళ్లాల్సిన వందలాది మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడంలో ఆలస్యం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల స్పందన:సమాచారం అందుకున్న రైల్వే సాంకేతిక సిబ్బంది హుటాహుటిన హంసవరం చేరుకున్నారు. ఇంజిన్‌లో తలెత్తిన లోపాన్ని సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా మరో ఇంజిన్‌ను ఏర్పాటు చేసి రైలును ముందుకు పంపే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది

Related Articles

Most Popular