Monday, April 13, 2026

సింగరేణి కార్మికుల చిరకాల వాంఛ అయిన “సొంత ఇంటి పథకం” హామీ అమలుపై మంత్రినీ కలిసిన INTUC నాయకులు…

(MS8NEWS డిసెంబర్ 29): సింగరేణి కార్మికుల చిరకాల వాంఛ అయిన “సొంత ఇంటి పథకం” హామీ అమలుపై తెలంగాణ రాష్ట్ర గృహ మరియు రెవిన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సెక్రటేరియట్‌లోని వారి ఛాంబర్‌లోINTUC సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్ నాయకత్వంలో INTUC నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు.

 

ఈ సందర్భంగా INTUC సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహ రెడ్డి, కంపెల్లి సమ్మయ్య, త్యాగరాజన్, జెట్టి శంకర్ రావ్;జనరల్ సెక్రటరీలు వికాస్ కుమార్ యాదవ్, ఏనుగు రవీందర్ రెడ్డి;సెక్రటరీ రాపర్తి శ్రీనివాస్ తదితరులు సింగరేణిలోని ప్రస్తుత పరిస్థితులను మంత్రి గారికి వివరించారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,ముఖ్యంగా కార్మికుల సొంత ఇంటి పథకంను తక్షణమే అమలు చేయాలని కోరారు.దీనిపై మంత్రి గారు సానుకూలంగా స్పందిస్తూ,ఈ అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చించి,ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Related Articles

Most Popular