Monday, April 13, 2026

సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం

(MS8NEWS జనవరి 7)రామగుండం:రానున్న సమ్మక్క–సారలమ్మ జాతరను భక్తులందరికీ సురక్షితంగా, సౌకర్యవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అరుణశ్రీ  నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

​ఈ సమావేశంలో పోలీస్, రెవిన్యూ, మున్సిపల్, దేవాదాయ శాఖ అధికారులతో పాటు ఎన్టీపీసీ (NTPC), ఆర్‌ఎఫ్‌సీఎల్ (RFCL), హెచ్‌కేఆర్ (HKR) సంస్థల ప్రతినిధులు మరియు జాతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమ్మక్క–సారలమ్మ జాతర కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, లక్షలాది మంది భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ భద్రత, ఫైర్ సేఫ్టీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసర సేవల కోసం హెల్త్ క్యాంపులు, అంబులెన్సులు, వైద్య సిబ్బందిని నిరంతరం అందుబాటులో ఉంచాలని సూచించారు.మౌలిక సదుపాయాలు తాగునీరు, పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ నియంత్రణ మరియు పార్కింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు, గద్దెల పరిసరాల నిర్వహణ, ప్రసాద పంపిణీ సజావుగా సాగేలా చూడాలని అధికారులకు సూచించారు.అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి, ఈ జాతరను ఒక ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక వేడుకగా నిర్వహించాలని రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు.

Related Articles

Most Popular