(MS8NEWS జనవరి 6):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు జనవరి 10వ తేదీ నుంచి జనవరి 16వ తేదీ వరకు సెలవులను ప్రకటించింది. ఈ సెలవులు ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు మరియు ఎయిడెడ్ పాఠశాలలన్నింటికీ వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
సెలవుల అనంతరం తిరిగి జనవరి 17వ తేదీ నుంచి అన్ని పాఠశాలలు యథావిధిగా ప్రారంభమవుతాయి. ఈ వారం రోజుల విరామం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవడానికి మంచి అవకాశం కల్పిస్తుంది.

