Sunday, April 12, 2026

శ్రీవారి సేవలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనం | ప్రజల శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు

MS8NEWS ఫిబ్రవరి 20తిరుమల: రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సన్నిధికి చేరుకున్న ఆయన.. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రామగుండం నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని ఈ సందర్భంగా ఆయన శ్రీవారిని వేడుకున్నారు.

స్వామివారి దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో వేద పండితులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం పలికారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలను సగౌరవంగా అందజేశారు.

Related Articles

Most Popular