MS8NEWS తిరుమల, 2026 మార్చి 04: శ్రీవారి ఆలయంలో మంగళవారం రాత్రి 8 గంటల నుండి భక్తులకు దర్శనం ప్రారంభమైంది. మధ్యాహ్నం 3.26 నుండి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్ర గ్రహణం ఉన్న కారణంగా ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉదయం 9 గంటలకు ఆలయ తలుపులు మూశారు.దాదాపు 10.30 గంటల అనంతరం మంగళవారం రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచారు. ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.
అన్నప్రసాద వితరణ ప్రారంభం:చంద్ర గ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 9 గంటలకు మూసివేసిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్సును 7.30 గంటలకు తెరిచారు. వంటశాల శుద్ధి అనంతరం రాత్రి 8.30 గంటల నుండి భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభమైంది. అదే విధంగా లడ్డు కౌంటర్లు కూడా పునః ప్రారంభమయ్యాయి.

