Sunday, April 12, 2026

శైలేందర్ ఠాకూర్ స్మారకార్థం సేవా కార్యక్రమం.

(MS8NEWS జనవరి 6):గోదావరిఖని:స్థానిక శ్రీ కోదండ రామాలయ ప్రాంగణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ​శైలేందర్ ఠాకూర్ స్మారకార్థం  అయ్యప్ప స్వాములకు బిక్ష (అన్నదానం) కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది.

​రామగుండం శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ సోదరులు, కీర్తిశేషులు శైలేందర్ ఠాకూర్ స్మారకార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన అయ్యప్ప స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

​ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్  సతీమణి మనాలి ఠాకూర్  ప్రత్యేకంగా పాల్గొన్నారు. వారు స్వయంగా అయ్యప్ప స్వాములకు బిక్ష వడ్డించి, వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. శైలేందర్ ఠాకూర్  జ్ఞాపకార్థం ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని భక్తులు కొనియాడారు.​ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, ఆలయ నిర్వాహకులు మరియు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

Related Articles

Most Popular