MS8NEWS గోదావరిఖని 17 : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్లోని రెల్లి విధి దుర్గమ్మ గుడి ప్రాంతంలో చెడిపోయిన బోర్ల కారణంగా స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిసిన వెంటనే స్పందించి, ఈరోజు మున్సిపల్ సిబ్బందిచే వెంటనే మరమ్మత్తులు చేయించడం జరిగింది.వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో డివిజన్ ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యగా ఈ బోర్లను రిపేర్ చేయించడం జరిగింది. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారం కోసం క్షణం ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవడం నా బాధ్యతగా భావిస్తున్నాను..ప్జలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా, డివిజన్లో ప్రతి సమస్యను నా సమస్యగా భావిస్తూ నిరంతరం ప్రజల మధ్య ఉండి మౌలిక వసతుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాను.9వ డివిజన్ ప్రజలకు ఎటువంటి సమస్య ఉన్నా నన్ను సంప్రదిస్తే వెంటనే స్పందించి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను అనీ తాళ్లపెల్లి యుగేందర్ తెలిపారు.

