(MS8NEWS డిసెంబర్ 19): విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో నిన్న రాత్రి ఒక్కసారిగా కలకలం రేగింది. ప్లాంట్ లోని కోక్ ఓవెన్ బ్యాటరీ-1 వద్ద స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.బ్యాటరీ-1 వద్ద జీసీఎం (GCM) గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.ఈ ఘటన రాత్రి సమయంలో చోటుచేసుకుంది.మంటలను గమనించిన వెంటనే అప్రమత్తమైన ఉద్యోగులు, అక్కడే ఉన్న ఛార్జింగ్ కార్‌ను హుటాహుటిన నిలిపివేశారు.అగ్నిమాపక సిబ్బంది మరియు ప్లాంట్ ఉద్యోగులు సమన్వయంతో గ్యాస్ మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం కలగలేదని తెలుస్తోంది. అధికారులు ప్రమాదానికి గల పూర్తి కారణాలపై విచారణ చేపట్టారు.

