(MS8NEWS డిసెంబర్ 20):విక్రవాండీ: చెన్నై-తిరుచిరాపల్లి జాతీయ రహదారిపై విక్రవాండీ సమీపంలో అర్ధరాత్రి వేళ పెను ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి మదురైకి 26 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ లగ్జరీ బస్సు నియంత్రణ కోల్పోయి వంతెన రైలింగ్‌ను ఢీకొట్టింది.
సమాచారం ప్రకారం, బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి వెళ్లడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు వేగంగా వెళ్లి వంతెన పక్కన ఉన్న భద్రతా రైలింగ్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి బస్సు ముందు భాగం రైలింగ్‌ను దాటుకుని బయటకు వెళ్లడంతో, బస్సు గాలిలో అర్థాంతరంగా వేలాడుతూ నిలిచిపోయింది. కింద లోతైన ప్రాంతం ఉండటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.ప్రమాద సమయంలో బస్సులో ఉన్న మొత్తం 26 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.23 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.స్థానికులు మరియు పోలీసులు వెంటనే స్పందించి ప్రయాణికులను కిటికీల ద్వారా సురక్షితంగా బయటకు తీశారు. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్రేన్ సహాయంతో వంతెనపై వేలాడుతున్న బస్సును తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
గమనిక: సుదీర్ఘ ప్రయాణాల్లో డ్రైవర్లు తగినంత విశ్రాంతి తీసుకోవాలని, నిద్రమత్తులో వాహనాలు నడపడం ప్రాణాంతకమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

