Wednesday, February 11, 2026

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి. రాజేశ్వరరావు.

(MS8NEWS జనవరి 6):​రామగుండం : జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని, స్థానిక అశోక్ నగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ మరియు భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి. రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన కల్పించారు.విద్యార్థులు తమ తల్లిదండ్రులు ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా హెల్మెట్ ధరించేలా ప్రోత్సహించాలని సిఐ గారు సూచించారు.వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలని, వాహనానికి సంబంధించిన సరైన పత్రాలను కలిగి ఉండాలని వివరించారు. చిన్నతనం నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగి ఉండటం వల్ల భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు.

​ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై జి. హరి శేఖర్, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం మరియు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు అడిగిన పలు సందేహాలను పోలీసులు నివృత్తి చేస్తూ, రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.

Related Articles

Most Popular