డిజిటల్ బుకింగ్‌కు ప్రోత్సాహం: రైల్‌వన్ యాప్ ద్వారా అన్‌రిజర్వడ్ టికెట్లపై డిస్కౌంట్
భారతీయ రైల్వే ప్రయాణికులకు మరింత పారదర్శకమైన, సులభమైన సేవలు అందించేందుకు కీలక చర్యలు చేపడుతోంది. టికెట్ల దళారీని అరికట్టే దిశగా ఇప్పటికే బుకింగ్ వ్యవస్థలో పలు మార్పులు తీసుకొచ్చిన రైల్వే, ఆధార్ వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది.
అడ్వాన్స్ రిజర్వేషన్ పిరియడ్ (ARP)లో భాగంగా 60 రోజుల ముందుగా అందుబాటులోకి వచ్చే టికెట్ల బుకింగ్‌కు కూడా ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసింది. ఈ మార్పులతో టికెట్లు నిజమైన ప్రయాణికులకే అందేలా చర్యలు తీసుకుంటోంది.
ఇదిలా ఉండగా, తాజాగా రైల్వే శాఖ రైల్‌వన్ (RailOne) యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా రిజర్వ్డ్, అన్‌రిజర్వ్డ్ టికెట్ల బుకింగ్, PNR స్టేటస్, ఫిర్యాదులు, ఫుడ్ ఆర్డర్ వంటి అన్ని సేవలను ఒకే ప్లాట్‌ఫామ్‌లో పొందవచ్చు. గతంలో ఇవన్నీ వేర్వేరు యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారా చేయాల్సి వచ్చేది.
డిజిటల్ ప్లాట్‌ఫాంల వినియోగాన్ని మరింత ప్రోత్సహించేందుకు, రైల్‌వన్ యాప్ ద్వారా చేసే అన్‌రిజర్వ్డ్ టికెట్ బుకింగ్‌పై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్‌ను జనవరి 14 నుంచి జులై 14 వరకు వినియోగించుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఆఫర్ రైల్‌వన్ యాప్ ద్వారా చేసే అన్‌రిజర్వ్డ్ టికెట్లకే పరిమితం అవుతుంది.
ఇదే కాకుండా, ఇప్పటికే రైల్‌వన్ యాప్‌లో R-వాలెట్ ద్వారా చెల్లింపులపై 3 శాతం క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. తాజా డిస్కౌంట్ ఆఫర్ ఈ క్యాష్‌బ్యాక్‌కు అదనమని రైల్వే స్పష్టం చేసింది.
ఇటీవల రిజర్వ్డ్ టికెట్ల బుకింగ్ విషయంలో కూడా మార్పులు అమల్లోకి వచ్చాయి. అక్టోబర్ 1 నుంచి ARP టికెట్ల బుకింగ్‌కు ఆధార్ వెరిఫికేషన్‌ను అమలు చేస్తోంది. ప్రస్తుతం టికెట్ల బుకింగ్ ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతోంది.
దశలవారీగా బుకింగ్ సమయాలను ఆధార్ వెరిఫైడ్ యూజర్లకే పరిమితం చేస్తూ రైల్వే నిర్ణయాలు తీసుకుంటోంది. జనవరి 12, 2026 నుంచి టికెట్ల బుకింగ్ ప్రారంభమైన తొలి రోజు ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కేవలం ఆధార్ వెరిఫైడ్ IRCTC యాప్, వెబ్‌సైట్ యూజర్లకే బుకింగ్ అవకాశం ఉంటుందని రైల్వే ప్రకటించింది.

