Wednesday, February 11, 2026

రైల్లో రెచ్చిపోయిన ట్రాన్స్‌జెండర్లు: డబ్బులు ఇవ్వలేదని ప్రయాణికుడిపై దాడి!

MS8NEWS జనవరి 22 న్యూఢిల్లీ: రైలు ప్రయాణాల్లో ట్రాన్స్‌జెండర్ల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. సామాన్య ప్రయాణికుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయడం, ఇవ్వని పక్షంలో అసభ్యంగా ప్రవర్తించడం లేదా దాడులకు దిగడం వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఒక రైలులో డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఓ ట్రాన్స్‌జెండర్ ప్రయాణికుడిపై విచక్షణారహితంగా దాడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, ఒక కిక్కిరిసిన రైలు బోగీలో కొందరు ట్రాన్స్‌జెండర్లు ప్రయాణికుల వద్దకు వెళ్లి డబ్బులు అడుగుతున్నారు. ఈ క్రమంలో లోయర్ బెర్త్ కింద కూర్చున్న ఒక ప్రయాణికుడు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఓ ట్రాన్స్‌జెండర్ సదరు ప్రయాణికుడిపై ఒక్కసారిగా దాడికి దిగింది.సమీపంలో ఉన్న తోటి ప్రయాణికులు వారించే ప్రయత్నం చేసినప్పటికీ, ఆ ట్రాన్స్‌జెండర్ శాంతించలేదు. నోటికి వచ్చినట్లు బూతులు తిడుతూ, ఆ వ్యక్తిని కాలితో తన్నుతూ, చేతులతో కొడుతూ తీవ్రంగా రెచ్చిపోయింది. “నీకు ఎంత ధైర్యం ఉంటే నాకు డబ్బులు ఇవ్వవని” అరుస్తూ భయానక వాతావరణాన్ని సృష్టించింది.​ఈ ఘటన జరుగుతున్న సమయంలో రైలు బోగీలో ఉన్న ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. కొందరు ఈ తతంగాన్ని తమ ఫోన్లలో చిత్రీకరించారు. “మేము కష్టపడి సంపాదించుకున్న డబ్బులను ఇలా బలవంతంగా అడగడం ఏంటి? ఇవ్వకపోతే కొడతారా?” అని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా రైల్వే అధికారులను ప్రశ్నిస్తున్నారు.

రైల్వే పోలీసుల స్పందనఈ వీడియో వైరల్ కావడంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) దృష్టికి ఈ విషయం వెళ్ళింది. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. రైళ్లలో ఇలాంటి అసౌకర్యాలు కలిగితే వెంటనే 139 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ప్రయాణికులకు సూచించారు.

Related Articles

Most Popular