MS8NEWS జనవరి 18: రైలు ప్రయాణాల్లో హిజ్రాల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. కేవలం డబ్బులు ఇవ్వలేదన్న నెపంతో ఓ యువకుడిని తీవ్రంగా హింసించిన అమానుష ఘటన వెలుగుచూసింది.సాధారణంగా రైళ్లలో డబ్బులు వసూలు చేసే ట్రాన్స్‌జెండర్లు, ఓ యువకుడిని డబ్బులు అడిగారు. అయితే తన వద్ద డబ్బులు లేవని ఆ యువకుడు చెప్పడంతో వారు ఒక్కసారిగా రెచ్చిపోయారు. తోటి ప్రయాణికులు చూస్తుండగానే సదరు యువకుడిని చుట్టుముట్టి వేధింపులకు గురిచేశారు.
టార్చర్.. నగ్న ప్రదర్శన!కేవలం తిట్టడంతో ఆగకుండా, ఆ యువకుడిని శారీరకంగా హింసించినట్లు సమాచారం. ప్రయాణికుల మధ్యే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, యువకుడిని తీవ్రమైన మానసిక ఆందోళనకు గురిచేశారు. ఎదురు తిరిగితే మరిన్ని ఇబ్బందులు పెడతారన్న భయంతో తోటి ప్రయాణికులు కూడా మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది.
వైరల్ అవుతున్న వీడియోలు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రైల్వే భద్రతా బలగాలు (RPF) ఇలాంటి ఘటనలపై దృష్టి పెట్టాలని, ప్రయాణికుల భద్రతను గాలికొదిలేశారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్య గమనిక: రైళ్లలో ఇలాంటి వేధింపులు ఎదురైతే వెంటనే రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

