(MS8NEWS జనవరి 8):హైదరాబాద్: రామగుండం అభివృద్ధి ప్రదాత, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ సంపూర్ణ సహకారంతో మరియు తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమలు & శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆశీస్సులతో, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఈరోజు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలవడమైనది.
ఈ సందర్భంగా బొంతల రాజేష్ మాట్లాడుతూ, గత 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం తాను చేసిన కృషిని, పార్టీ కార్యక్రమాల్లో తన క్రియాశీలక పాత్రను వివరిస్తూ తన “పొలిటికల్ ప్రొఫైల్” (Political Profile) ను టీపీసీసీ అధ్యక్షులకు అందజేశారు. పార్టీకి చేసిన సేవలను గుర్తించి, తనకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం కల్పించాలని వారు విన్నవించారు.

