Monday, April 13, 2026

రాముగుండం కార్పొరేషన్ 5వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాటూరి సత్యప్రసాద్‌..? రంగంలోకి ప్రజాసేవకుడు!

MS8NEWS జనవరి 18 రామగుండం (గంగనగర్):రామగుండం నగరపాలక సంస్థ ఎన్నికల వేడి మొదలైంది. గంగనగర్ 5వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా మాటూరి సత్యప్రసాద్ కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ ఆశిస్తున్నారు . స్థానిక ఎమ్మెల్యే . రాజ్ ఠాకూర్ ఆశీస్సులతో, ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోవడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు.

​ఈ సందర్భంగా సత్యప్రసాద్ మాట్లాడుతూ, “మీ ఇంటి బిడ్డగా ప్రజా సేవకై మీ ముందుకు వస్తున్నాను. మీ కష్టాలను నా భుజాన వేసుకుంటాను. ప్రతి ఇంటికి అండగా ఉంటానని” ప్రజలకు హామీ ఇచ్చారు. డివిజన్ అభివృద్ధి బాటలో పయనించాలంటే మార్పు అవసరమని ఆయన పేర్కొన్నారు.

​ముఖ్య నినాదం: “ఒక్క అవకాశం ఇవ్వండి.. ఆశీర్వదించండి.. కార్పొరేటర్‌గా గెలిపించండి.”​గంగనగర్ ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని, డివిజన్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున ఆయనకు మద్దతు తెలుపుతున్నాయి.

Related Articles

Most Popular