Monday, April 13, 2026

రామగుండం లారీ యజమానుల సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద నిరసన

MS8NEWS జనవరి 17:(గోదావరిఖని):రామగుండం లారీ యజమానుల సంక్షేమ సంఘం కార్యాలయం ముందు ఇద్దరు లారీ యజమానులు భైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. సంఘం అధ్యక్షుడి మొండి వైఖరి వల్ల తమకు అన్యాయం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.కడారి సంతోష్ రావు మరియు కంది శ్రీధర్.సంఘం అధ్యక్షుడు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, లారీ లైన్ లో తమకు అవకాశం ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. తమకు వెంటనే లారీ సీరియల్ కేటాయించి, న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

​తమ నిరసనలో భాగంగా “అధ్యక్షుడి ఏకపక్ష నిర్ణయాలు నశించాలి” మరియు “మాకు న్యాయం కావాలి” అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. సంఘం నాయకత్వం తమ సమస్యను పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేదే లేదని వారు స్పష్టం చేశారు.

Related Articles

Most Popular